విడుద‌ల కానున్న 4 కొత్త మోటో ఫోన్లు..!

విడుద‌ల కానున్న 4 కొత్త మోటో ఫోన్లు..!

 మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన నాలుగు కొత్త మోటో ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది. మోటో జీ7, జీ7 ప్ల‌స్‌, జీ7 ప్లే, జీ7 ప‌వ‌ర్ పేరిట ఆ 4 ఫోన్లు విడుదల కానున్నాయ‌ని స‌మాచారం. అదే రోజున బ్రెజిల్ లో నిర్వ‌హించ‌నున్న ఓ ఈవెంట్‌లో మోటోరోలా ఈ నాలుగు ఫోన్ల‌ను విడుద‌ల చేస్తుంద‌ని తెలిసింది. ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే... మోటో జీ7లో 6.24 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

మోటో జీ7 ప్ల‌స్‌లో 6.24 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. అలాగే మోటో జీ7 ప్లే ఫోన్‌లో 5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 12, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఇక మోటో జీ7 ప‌వ‌ర్ ఫోన్‌లో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 12, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. కాగా మోటో జీ7 ప్లే, జీ7 ప‌వ‌ర్ ఫోన్లు రూ.12,075, రూ.16,935 ప్రారంభ ధ‌ర‌ల‌కు ల‌భ్యం కానున్న‌ట్లు తెలిసింది. వీటి పూర్తి ధ‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.