విడుదల కానున్న షియోమీ ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్

విడుదల కానున్న షియోమీ ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్

 మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ2 ను గత కొద్ది రోజుల కిందట స్పెయిన్ మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను రేపు భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22,500 గా ఉండనున్నట్లు సమాచారం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.