వివో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయ్‌..!

వివో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయ్‌..!

  న్యూఢిల్లీ: చైనీస్‌ ఫోన్‌మేకర్‌ వివో తన  ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను  తగ్గించింది. వివో వి7ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ తో పాటు బడ్జెట్‌ ఫోన్‌ వై 53లను  తగ్గింపు  ధరల్లో కస్టమర్లకు అందుబాటులోఉంచినట్టుతెలిపింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో  ఈ  తగ్గింపునువర్తింప   చేస్తున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 24ఎంపీ  సెల్పీ కెమెరాతో లాంచ్‌ చేసిన  వి7 ప్లస్‌ పై రూ.2వేల తగ్గింపులో  ప్రస్తుత ధర రూ.19,990గా ఉంది. దీని లాంచింగ్‌ ప్రైస్‌ రూ.29,990. ఇక బడ్జెట్‌ ఫోన్‌ వై53  స్టార్ట్‌ఫోన్‌పై రూ. 500తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది.దీంతో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 8,490కి అందుబాటులోఉంచింది.  

వివో వి7ప్లస్‌ ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
16ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ప్లాష్‌
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3225 ఎంఏహెచ్‌ బ్యాటరీ

వై 53 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
 540x960  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ మార్షమిల్లౌ 6.0
2జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
8ఎంపీ రియర్‌ కెమెరావిత్‌ఎల్‌ఈడీప్లాష్‌
 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ