వాట్సాప్‌లో ఈ లింక్ వచ్చిందా..?

వాట్సాప్‌లో ఈ లింక్ వచ్చిందా..?

 వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు వచ్చే స్పామ్, నకిలీ మెసేజ్‌లు, వైరస్ లింక్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ అందులో అలాంటి వాటి బెడద తప్పడం లేదు. ఎప్పటికప్పుడు నకిలీ లింక్స్ దర్శనమిస్తూనే ఉన్నాయి. దీంతో అవి అసలువే అనుకునే వాట్సాప్ యూజర్లు తమకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేస్తున్నారు. తరువాత ఫోన్‌కు జరిగే నష్టం గురించి తెలుసుకుని లబో దిబోమంటున్నారు. తాజాగా ఇలాంటి న‌ష్టాన్ని క‌లిగించే ఓ వైరస్ కలిగిన లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతున్నది. 


వాట్సాప్ యూజర్లకు చిత్రంలో చూపినట్టుగా అడిడాస్ 3000 మందికి షూస్ ఉచితంగా ఇస్తుందనే ఓ నకిలీ వార్త, లింక్ ఇప్పుడు వైరల్‌గా ఫార్వార్డ్ అవుతున్నది. ఈ క్రమంలో సదరు లింక్‌ను ఓపెన్ చేసిన వారి ఫోన్లలోకి వైరస్ వస్తున్నది. కనుక ఎవరికైనా వాట్సాప్‌లో ఈ లింక్ వస్తే ఓపెన్ చేయకండి. లేదంటే ఫోన్ వైరస్ బారిన పడే అవకాశం ఉంది.