వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ఫీచర్..!

వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ఫీచర్..!

  ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అదే ఫార్వార్డెడ్ మెసేజెస్. ఈ ఫీచర్ వల్ల మనకు ఇతర యూజర్ నుంచి వచ్చిన మెసేజ్ ఒరిజినల్ మెసేజా, లేదంటే ఇతరులచే ఫార్వార్డ్ చేయబడిన మెసేజా అనేది సులభంగా తెలిసిపోతుంది. సాధారణంగా మనకు వాట్సాప్‌లో రోజూ అనేక మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని మనం మన వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్న ఇతరులకు షేర్ చేస్తుంటాం. అయితే ఇలా షేర్ చేసే మెసేజ్‌లే ఫార్వార్డెడ్ మెసేజ్‌లుగా చూపించబడతాయి. మెసేజ్ పై భాగంలో ఫార్వార్డెడ్ అని వస్తుంది.

దీంతో ఆ మెసేజ్ అవతలి యూజన్ సొంతంగా పంపిన ఒరిజినల్ మెసేజ్ కాదని, ఆ యూజర్‌కు మరో యూజర్ నుంచి వచ్చిన మెసేజ్ అని ఇట్టే తెలిసిపోతుంది. దీని వల్ల స్పాం మెసేజ్‌లు, నకిలీ మెసేజ్‌ల బారిన పడకుండా ఉండవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్షన్‌లో మాత్రమే లభిస్తున్నది. త్వరలో పూర్తి స్థాయిలో యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.