వాట్సప్‌లో సమాచారం ‘భద్రం’

వాట్సప్‌లో సమాచారం ‘భద్రం’

  న్యూయార్క్‌ : ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాట్సప్‌ భద్రతపై కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్‌లోని మెసేజలను కూడా ట్రాక్‌ చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్‌ శనివారం ఈ ఆరోపణలను ఖండించింది. తాము చాలా స్పల్ప డేటానే సేకరించడం జరుగుతుందని స్పష్టం చేసింది. వాట్సాప్‌ను భారత్‌లో 20 కోట్ల మంది వినియోగిస్తుండటంతో, భద్రతా రీత్యా ఇది అంత సురక్షితం కాదంటూ వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. వినియోగదారులు ఇతరులకు పంపించే సందేశాలను తాము ట్రాక్‌ చేయడం లేదని తెలిపింది. వినియోగదారుల గోప్యత, భద్రత తమకు ముఖ్యమని వాట్సాప్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, అమెరికాకు చెందిన మెటాడాటా సంస్థ మాత్రం కాల్స్‌ కు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ సేకరిస్తుందన్న సందేహాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.