వాట్సాప్‌పై షాకింగ్‌ రిపోర్ట్‌

వాట్సాప్‌పై షాకింగ్‌ రిపోర్ట్‌

  ఒకవైపు ఆధార్‌డేటా బ్రీచ్  ఆందోళన రేపితే..తాజాగా  ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో  కనుగొన్న  భద్రతా లోపం ప్రకంపనలు పుట్టిస్తోంది. వాట్సాప్‌  చాట్‌ చాలా భద్రంగా ఉంటుందని  ప్రపంచ వ్యాపంగా  కోట్లాది మంది యూజర్లు నమ్ముతోంటే.. గ్రూపు చాటింగ్‌ ప్రమాదంలో పడనుందని పరిశోధకులు తేల్చారని వైర్డ్‌   రిపోర్ట్‌ చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం  వాట్సాప్‌లో జోడించిన   ఎండ్‌ టు ఎండ్‌ ఎన్క్రిప్షన్‌ ఫీచర్‌లో   ఘోరమైన లోపాన్ని పరిశోధకులు కనుగొన్నారట. వాట్పాప్‌  గ్రూప్‌ చాట్‌లోకి  అపరిచితులుఎవరైనా చొరబడవచ్చంటూ జర్మన్‌ పరిశోధకులు షాకింగ్‌ నివేదికను వెల్లడించారు.

స్విట్జర్లాండ్‌, జ్యూరిచ్‌లోని జరిగిన  రియల్ వరల్డ్ క్రైప్టో సెక్యూరిటీ కాన్ఫరెన్‌లో  పరిశోధకులు ఈ  షాకింగ్‌ నివేదికను సమర్పించారు. వాట్పాస్‌ సర్వర్‌పై  కంట్రోల్‌ సాధించడం ద్వారా ప్రయివేటు  గ్రూపు చాట్‌లోకి స్వయంగా తాముగానీ, వేరే వ్యక్తి ప్రవేశానికి అనుమతినిస్తుందని తెలిపింది. ఈ లోపం కారణంగా  గ్రూప్‌ చాట్‌లోకి ఎవరైనా ఇట్టే ఎంటర్‌ కావచ్చని రిపోర్ట్‌ తేల్చింది. గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేకుండానే... గ్రూప్‌చాట్‌లోకి  అనుమతి లభిస్తోందని తెలిపింది.  అంతేకాదు ఇది గుర్తించి సదరు వ్యక్తులను  తొలగించడానికి అడ్మిన్‌ చేసే  ప్రయత్నాన్ని  కూడా  ఈ బగ్‌ నిరోధిస్తుందని  వెల్లడించింది. ఇదే విషయాన్నిసంస్థ దృష్టికి తీసుకెళ్లినట్టుగా పరిశోధకులు వెల్లడించారు.

మరోవైపు పరిశోధకుల  రిపోర్టును వాట్సాప్‌ ప్రతినిధులు ధృవీకరించడం మరింత ఆందోళనకు దారి తీసింది. ఫేస్‌బుక్‌ ఛీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అలెక్స్‌ స్టామస్‌ దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ గ్రూపులోకి రహస్యంగా చొరబడే అవకాశం లేదని ప్రకటించారు. ఈ  రిపోర్ట్‌ను తాను  పరిశీలించాననీ, కానీ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీ తమకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు.  గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతిలేకుండా రహస్యంగా ఎవరూ గ్రూప్‌లో చేరలేరనీ, కొత్త వ్యక్తులు చేరిన వెంటనే గ్రూపు సభ్యులకు నోటిఫికేషన్‌ అందుతుందని  ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ద్వారా పూర్తి భద్రత  కల్పించినట్టు  స్పష్టం చేశారు.