షామీ నుంచి  36 వేల స్మార్ట్‌ఫోన్

షామీ నుంచి  36 వేల స్మార్ట్‌ఫోన్

 న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ..ప్రీమియం సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న సామ్‌సంగ్, ఆపిల్ సంస్థలతో పోటీకి సిద్ధమైంది. దీంట్లో భాగంగా రూ.35,999 ధర కలిగిన ఎంఐ మిక్స్ 2ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ ఇప్పటి వరకు విడుదల చేసిన వాటిలో ఇదే గరిష్ఠ ధర కలిగినదని షామీ వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఎండీ మను జైన్ తెలిపారు. 5.99 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయన్నారు.