>

11న కొత్త జిల్లాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన

11న కొత్త జిల్లాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన

హైదరాబాద్: గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరిగి అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఇప్పటికే జిల్లాల్లో స్థలాలు సేకరించి, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నాయి.

ఈ నెల 11వ తేదీన సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాల్లో, 12వ తేదీన సూర్యాపేటలో జిల్లాలో  సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది.అదేవిధంగా మిగతా చోట్ల రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

జనగామలో కడియం శ్రీహరి, వనపర్తిలో మహమూద్ అలీ, గద్వాలలో లకా్ష్మరెడ్డి, నాగర్ కర్నూల్‌లో జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్‌లో జోగు రామన్న, మంచిర్యాల, పెద్దపల్లిలో నాయిని నర్సింహారెడ్డి, మేడ్చల్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డిలో కత్తి పద్మారావు, వికారాబాద్‌లో మహేందర్‌రెడ్డి, జగిత్యాలలో ఈటల రాజేందర్, కామారెడ్డిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.