2 లక్షలతో హైదరాబాద్ వచ్చిన మైనర్ బాలురు

2 లక్షలతో హైదరాబాద్ వచ్చిన మైనర్ బాలురు

హైదరాబాద్: ఎల్.బి.నగర్  రింగ్ రోడ్డు దగ్గర ఇద్దరు మైనర్ బాలురులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.స్కూటీపై వస్తున్న వారినిపై అనుమానం రావడంతో అపి  తనిఖీ చేశారు. బ్యాగ్ లో భారీగా డబ్బులు ఉండటంతో  స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ లో ఉన్న రెండు లక్ష ఇరవై వేల నగదుతో ప్పాటు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  వారి ఫోన్ల నుంచి తల్లిదండ్రులకు ఫోన్ సమాచారం అందజేశారు.

రాజమండ్రికి చెందిన ఇద్దరు మైనర్ బాలలు నికేశ్, భాను స్నేహితులు. 8వ తరగతి చదువుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న జూ పార్క్, వన్డర్  లా, ఇతర పర్యాటక ప్రాంతాలు చూద్దాం.. అని ఇద్దరూ కూడబలుక్కుని ఇంట్లో చెప్పకుండా 2.20 లక్షల రూపాయలు తీసుకొని హోండా ఆక్టీవాపై హైదరాబాద్ కి వచ్చారు.మూడు రోజుల కింద ఇంట్లో చెప్పకుండా వారు హైదరాబాద్ బయలుదేరినట్టు తెలిసింది.

 పిల్లల తల్లిదండ్రులను పిలిచి వాళ్లకు అప్పజెపుతామాని క్యాష్ ను కూడా ఇచ్చేస్తామని ఎల్.బి.నగర్  ఏసీపీ వేణుగోపాల్ రావు తెలిపారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకపోతే.. ఇబ్బందులు తప్పవు. వాళ్లు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. లేకపోతే తర్వాత బాధపడాల్సింది తల్లిదండ్రులే. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త గా వ్యహరించక పోతే  ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయన్నారు.