అనురాగ్ శర్మకు పోలీస్ శాఖ ఘన వీడ్కోలు

అనురాగ్ శర్మకు పోలీస్ శాఖ ఘన వీడ్కోలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మొదటి డీజీపీ అనురాగ్‌శర్మ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది.ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్‌శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.

డీజీపీగా అనురాగ్‌శర్మ పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని అనురాగ్‌శర్మకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.

11 పోలీస్ బృందాలు కవాతు, పరేడ్‌లతో ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమంలో కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.