>

‘అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం’

‘అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం’

 హైదరాబాద్ : దళిత, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖపై జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని ఉద్ఘాటించారు. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దళిత ఆడబిడ్డల వివాహాలకు రూ. 75 వేలు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం తమది అని స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని గుర్తు చేశారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. పేదల ముఖాల్లో వెలుగులు చూడాలన్నదే సీఎం ఆకాంక్ష అని తెలిపారు.


Loading...