>

‘ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం’

‘ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం’

ఆదిలాబాద్‌: రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కందు ల కొనుగోళ్లను ప్రారంభించారు. క్వింటా లుకు రూ. 5,050 మద్దతు ధర నిర్ణయిం చారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ ద్వారా కందులు కొనుగోలు చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే వారిని తరిమికొట్టాలని రైతులకు పిలుపు నిచ్చారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు కుడి కాల్వ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు రాథోడ్‌ బాపురావు, కోనేరు కోనప్ప, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రులు వెళ్లగానే కొను గోళ్లు నిలిచిపోయాయి. సాయంత్రం 4గంట లకు కొనుగోళ్లు ప్రారంభించగా.. 5 గంట లకు తేమ శాతాన్ని మార్కెటింగ్‌ అధికారులు పరిశీలించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ఎండబెడితేనే కొనుగోలు చేస్తా మన్నారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. రాత్రి 7.30 గంటల వరకూ కొనుగోళ్లు ప్రారంభించ లేదు. మార్కెట్‌ చైర్మన్‌ రాజన్న వచ్చి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.


Loading...