బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అగ్నిప్రమాదం

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అగ్నిప్రమాదం

 హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లోని జావేద్ హబీబ్స్ బ్యూటీ సెలూన్ లో దీపావళి రోజున అగ్ని ప్రమాదం సంభవించింది. సెలవు రోజు కావడంతో షాపును మూసేసిన నిర్వాహకులు తాళం వేసి వెళ్ళారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సెలూన్ లోంచి దట్టమైన పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు అరగంట పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకు వచ్చారు. సెలూన్ లో ఖరీదైన ఫర్నీచర్ తో పాటు విలువైన సామగ్రి పూర్తిగా మంటల్లో కాలి బుడిదయిందని నిర్వాహకులు తెలిపారు.