బీసీల కోటా తగ్గదు

బీసీల కోటా తగ్గదు

  హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 34 శాతం కన్నా తగ్గకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించిందని, ఇప్పుడు కూడా ఆ విధంగా అమలుచేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం కన్నా రిజర్వేషన్లు మించరాదని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై కూలంకషంగా చర్చించారు. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులైన మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న ప్రత్యేకంగా హాజరయ్యారు.