చెరువులోకి రసాయనాలు వదిలిన పరిశ్రమలపై చర్యలు

చెరువులోకి రసాయనాలు వదిలిన పరిశ్రమలపై చర్యలు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పూర్‌లో గండిచెరువులోకి పరిశ్రమల రసాయనాలు వదలడంతో వేలాది చేపలు మృతిచెందిన విషయం తెలిసిందే.

శనివారం చెరువును పరిశీలించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మత్య్సకారుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ…చెరువుల్లో రసాయనాలు వదిలితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అన్నారు.

  చెరువులోకి రసాయనాలు వదిలిన పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పరిశ్రమలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటమని చెప్పారు.