దసరా నుంచి థియేటర్లలో 5 షోలు

దసరా నుంచి థియేటర్లలో 5 షోలు

హైదరాబాద్: తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ  అధికారులతో రివ్యూ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.నవంబర్ లో హైదరాబాద్ లో జరగనున్న బాలల చలనచిత్ర ఉత్సవాలకు 8 కోట్ల రూపాయలను విడుదల చేయాలన్నారు. ఈ ఏడాది దసరా నుంచి తెలంగాణ లోని అన్ని థియేటర్లలో ఐదో ఆటగా చిన్న సినిమాలు వేసేందుకు అనుమతి ఇచ్చింది సర్కార్. అటు నంది అవార్డుల స్థానంలో సింహ అవార్డులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. దసరా పండగ నాటికి సింగిల్ విండో విధానంల భాగంగా ఆన్ లైన్ లోనే షూటింగ్ లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నంది అవార్డుల స్థానంలో సింహ అవార్డులిస్తామని దీనిని  సీఎం ఆమోదించాల్సి ఉందని చెప్పారు FDC  చైర్మన్ రామ్మోహన్ రావు.చిత్రపురి కాలనీకి అదనంగా 10 ఎకరాల స్థలం కేటాయింపునకు సంబంధించి అధికారులను నివేదిక అడిగారు.  అబ్దుల్లాపూర్ మెట్, కోహెడ ప్రాంతాలల్లో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో నిర్మాణంతో పాటు.. ఆర్టీసీ బస్టాండ్ లల్లో  మినీ థియేటర్ల మీద అధికారులతో మాట్లాడారు మంత్రి. నవంబర్ లో హైదరాబాద్ లో జరగనున్న బాలల చలనచిత్ర ఉత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి.