‘ఇవే నా చివరి ఎన్నికలు’

‘ఇవే నా చివరి ఎన్నికలు’

  హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఇవే తనకు చివరి ఎన్నికలు కావచ్చని అన్నారు. తన ఆరోగ్యం అస్సలు బాగా లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. యాకూత్‌పుర ఎన్నికల సభలో మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. నా కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట పరిస్థితి చేయి దాటి పోయింది. డాక్టర్ నన్ను డయాలసిస్ చేసుకోమన్నారు అని అక్బరుద్దీన్ చెప్పారు. నా ఆరోగ్యాన్ని చూసుకునే సమయం దొరకడం లేదు. స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు, హాస్పిటల్స్ చూసుకోవడానికే సరిపోతుంది అని ఆయన తెలిపారు. అనారోగ్యం కారణంగా ఇప్పటికే అక్బర్ కొన్ని ఎన్నికల సభల్లో పాల్గొనలేదు. తానెప్పుడూ తన కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని, తన కమ్యూనిటీకి సేవ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా.. వాళ్ల కోసం తన స్థానం ఖాళీ చేస్తానని అక్బర్ స్పష్టం చేశారు.