>

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు       

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు       

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్త వైష్ణవ ఆలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. విష్ణువు అవతార ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. యాదాద్రి బాలాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ మండపం ద్వారా ఉదయం 6.45 గంటల నుంచి భక్తులకు ఉత్తరద్వారా దర్శనం కల్పించనున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా

హైదరాబాద్‌లోని పలు వైష్ణవ ఆలయాలతో పాటు హిమాయత్‌నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఖమ్మం జిల్లా రంగనాయకుల స్వామి, శ్రీకృష్ణ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ జెండా బాలాజీ ఆలయంలో, వరంగల్‌లో గల వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో, మహబూబ్‌నగర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో, సంగారెడ్డి శ్రీవైకుంఠపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Loading...