నగరం లో 16,17 తేదీల్లో LRS మేళా

నగరం లో 16,17 తేదీల్లో LRS మేళా

హైదరాబాద్: GHMC పరిధిలో రెండేళ్లుగా లే అవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌(LRS) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా పూర్తి  కాకపోవడంతో GHMC కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి విభిన్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు జోన్ల వారీగా మేళాలు నిర్వహించాలని GHMC నిర్ణయించింది. ఈ నెల 16, 17 తేదీల్లో మేళా నిర్వహించాలని జోనల్‌ సిటీ ప్లానర్లకు ఆదేశాలు జారీ చేశారు.

LRL దరఖాస్తుల పరిశీలన జోనల్‌ స్థాయిలో ప్రక్రియ జరుగుతుండడంతో క్షేత్రస్థాయిలో ఆలస్యం జరుగుతోంది. ఆన్‌లైన్‌ విధానం అందుబాటులో ఉన్నా కొందరు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చేతులు తడిపితే కానీ.. దరఖాస్తుల పరిశీలన మొదలు కాని దుస్థితి నెలకొంది. దీనిపై పలువురు దరఖాస్తుదారులు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

దీంతో మేళాలు ఏర్పాటుచేసి LRS దరఖాస్తులు పరిశీలించాలని నిర్ణయిం చారు. ఐదు జోన్లలో మేళాలు జరుగతున్నాయి. రోజూ 150 చొప్పున రెండు రోజుల్లో 300 దరఖాస్తులకు తుది ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని సూచించారు. పరిశీలన పూర్తయి షార్ట్‌ఫాల్‌, ట్యాక్స్ చెల్లించని దరఖాస్తులపై ముఖ్యం గా దృష్టి సారించాలన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని మేళాకు రావాలని దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. రుసుము చెల్లించిన వారికి అక్కడే ప్రొసీడింగ్‌ లెటర్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ జనార్దన్‌రెడ్డి.

2015లో ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ పథకం లో భాగంగా GHMC కి 84,956 LRS, 1.31 లక్షల BRS దరఖాస్తులు వచ్చాయి. కోర్టు పరిధిలో ఉండడంతో BRS దరఖాస్తుల పరిశీలన ప్రారంభించినా తుది ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన రెండేళ్లుగా జరుగుతోంది. 71,628 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చిన అధికారులు...40 వేలకుపైగా తుది ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. మరో రెండు వేల దరఖాస్తుల పరిశీలన, సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేయాల్సి ఉంది. ట్యాక్స్ చెల్లించకపోవడంతో 25 వేలకుపైగా దరఖాస్తులకు ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వలేదు.