హైదరాబాద్ నుంచి అమరవీరుల స్ఫూర్తియాత్ర

హైదరాబాద్ నుంచి అమరవీరుల స్ఫూర్తియాత్ర

టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నిన్న చేపట్టిన అమరవీరుల స్ఫూర్తియాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా యాత్రకు పర్మిషన్ లేదంటూ కోదండరాంను కామారెడ్డి జిల్లాలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను హైదరాబాద్ తరలించే వరకు పెద్ద హైడ్రామా కొనసాగింది.

ఇవాళ హైదరాబాద్ నుంచి అమరవీరుల స్ఫూర్తియాత్రను ప్రారంభించనున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాళ్ల వర్షం కురిపించినా యాత్ర మాత్రం ఆగదని కోదండరాం ఇప్పటికే స్పష్టం చేశారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో యాత్ర కొనసాగించి తీరతామని చెప్పారు కోదండరాం.

ఇలాంటి పరిస్థితుల్లో కోదండరాం ఇవాళ మళ్లీ అమరవీరుల స్ఫూర్తి యాత్ర ప్రారంభించబోతున్నారు. దీంతో నిన్నటి  సీన్లే ఇవాళ కూడా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. కోదండరాం చేపట్టిన యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టీజేఏసీ ఛైర్మన్ కూడా యాత్రను కొనసాగించి తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.