హైదరాబాద్ నగరంలో చెడ్డి గ్యాంగ్ దొంగలు

హైదరాబాద్ నగరంలో చెడ్డి గ్యాంగ్ దొంగలు

  హైదరాబాద్ : నగరంలో చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా సంచరిస్తున్నదని, ప్రధానంగా మియాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని కాలనీలపై సదరు ముఠాలు దృష్టి కేంద్రీకరించాయని ఇన్‌స్పెక్టర్ హరిశ్ఛంద్రారెడ్డి పేర్కొన్నారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాతృశ్రీనగర్, దీప్తి శ్రీనగర్, అదే విధంగా కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా దొంగతనాలు చేసేందుకు యత్నించాయని, వాటికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను ఆయన మీడియాకు విడుదల చేశారు.


చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠాతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు. మియాపూర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ఈ చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు యత్నిస్తుందని అన్నారు. గతంలోను ఈ మూఠా కూకట్ పల్లి ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడిన సందర్భాలున్నాయన్నారు. రాత్రి వేళల్లో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా, ముఠాకు సంబంధించిన ఏ సమాచారం అందినా వెంటనే కంట్రోల్ రూం నెంబర్ 100 లేదా 9490617129కు సమాచారం అందించాలని సూచించారు.