హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ మహానగరం నీటీ మునిగింది. బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టుప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని కొన్ని ప్రాంతాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లోనే ఉండిపోయాయి.

కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో లాలాపేటలోని ఫంక్షన్‌హాల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద నీటిలో చిక్కుకున్న మల్కాజ్ గిరిలోని పలు కాలనీల్లో మోకాళ్లలోతు నీళ్లలోనూ రాష్ట్ర మంత్రి పద్మారావు పునరావాస కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిరాశ్రయులుగా మారిన వారి గురించి చర్యలు తీసుకునే దిశగా GHMC అధికారులకు పద్మారావు ఆదేశాలు జారీచేశారు. నగరంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో అందులోని నగరవాసులు కిందకు వచ్చేందుకు అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది.

ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజ్‌గిరిలో బండ్ల చెరువు వరద నీరు మురుగునీరులోకి చేరింది. దీంతో పటేల్‌ నగర్‌, దుర్గానగర్‌లోని ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దుర్గంధం భరించలేక వారంతా ఇళ్లపైకి చేరుకున్నారు. పటేల్‌నగర్, దుర్గానగర్, సాయిపురి కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది.

భారీగా కురిసిన వర్షంతో పలు కాలనీళ్లోకి భారీగా నీళ్లు చేరాయి.  సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.వర్షాలు మరో రెండు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.