ఖమ్మం పట్టణం లో మంత్రి ఆకస్మిక పర్యటన

ఖమ్మం పట్టణం లో మంత్రి ఆకస్మిక పర్యటన

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో కలిసి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఆకస్మికంగా పర్యటించారు.

 బైక్‌పై నగరంలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అనుకున్న సమయంలోపే లకారం పార్క్ సుందరీకరణ, దుంసులాపురం రైల్వే బ్రిడ్జిని పూర్తి చేస్తామని తుమ్మల తెలిపారు. వందకోట్లతో గొళ్లపాడు ఛానల్‌ను అభివృద్ధి చేస్తామని తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు.సీఎం కేసీఆర్ చొరవతో ఖమ్మం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.