కొన్ని మీడియా సంస్థలకు కామన్ సెన్స్ లేదు

 కొన్ని మీడియా సంస్థలకు కామన్ సెన్స్ లేదు

  హైదరాబాద్ : మీడియా సంస్థలు కొన్ని నిజానిజాలు తెలుసుకోకుండా, కామన్‌సెన్స్‌లేకుండా, వార్తలు ప్రచురిస్తున్నాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం, ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మూడురోజులపాటు సహస్ర మహాచండీయాగం చేస్తున్నారంటూ ఓ ఇంగ్లిష్ మీడియా వార్తను ప్రచురించింది. కేసీఆర్ ప్రధాని కోసం యాగాలు చేయడంలేదని, ఇలాంటి వార్త లు నిరాధారం అని పేర్కొంటూ కేటీఆర్‌కు హర్షవర్దన్ అనేవ్యక్తి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మీడియా సంస్థలు కామన్‌సెన్స్ లేకుండా వార్తలు ప్రచురిస్తున్నాయంటూ రీ ట్వీట్‌చేశారు.