నల్లగొండలో నేనే పోటీ చేస్తా అనుకున్న:  కేసీఆర్

నల్లగొండలో నేనే పోటీ చేస్తా అనుకున్న:  కేసీఆర్

  నల్లగొండ: బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో నేనే నల్లగొండ శాసనసభ్యుడిగా పోటీ చేస్తా అనుకున్నానని సీఎం తెలిపారు. తనను నియోజకవర్గం మారొద్దని గజ్వెల్ ప్రజలు ఒత్తిడి చేయడంతో తనకు బదులుగా భూపాల్‌రెడ్డిని నిలబెట్టామని పేర్కొన్నారు. నల్లగొండ అభివృద్ధి చెందాలంటే భూపాల్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తతు తీసుకుని అండర్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ మంచి రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పిస్తానని హామి ఇచ్చారు. టీఆర్ఎస్‌ పార్టీ 100కు పైగా సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. భూపాల్‌రెడ్డిని గెలిపించి నల్లగొండ పట్టణ రూపురేఖలు మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.