పోలీసులకు కూడా రూల్స్ వర్తిస్తాయి

పోలీసులకు కూడా రూల్స్ వర్తిస్తాయి

హైదరాబాద్: మేం పోలీసులం అంటూ విర్రవీగే వాళ్లకు పెద్ద షాక్ ఇది. సోషల్ మీడియా పుణ్యమా అని పోలీసులకు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.ఇటీవల ఫేస్ బుక్, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలకు కంప్లయింట్స్ వెల్లువెత్తుతున్నాయి. మీ పోలీసులు ఎలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నారో చూడండి అంటూ పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున ఫొటో సాక్ష్యంతో పోస్ట్ చేస్తున్నారు. వీటిని మంత్రి కేటీఆర్, డీజీపీ అనురాగ్ శర్మలకు కూడా షేర్స్ కొడుతున్నారు.

 రోజురోజుకు పబ్లిక్ నుంచి ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన రాజకీయ నాయకుడు  అమ్జదుల్లా ఖాన్ ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. చెప్పడం కాదు చేసి చూపండి అనే హ్యాష్ ట్యాగ్ తో పోలీసుల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసేవారు. అంతేకాదు వాటిని మంత్రి కేటీఆర్, డీజీపీ అనురాగ్ శర్మలకు ట్యాగ్ చేసేవారు. ఇలా ఎప్పుడు ఎక్కడ పోలీసులు కనపడ్డా ఇదే పరిస్థితి. ఇదో పెద్ద ఉద్యమమే అయ్యింది. ఆయన బాటలోనే మరికొందరు నడిచారు.

తమ కంట పడ్డ  పోలీసులను ఫొటోలు తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసేవారు.  ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ స్పందించింది. పబ్లిక్ నుంచి వచ్చిన పోస్టుల్లోని పోలీసులకూ ట్రాఫిక్ చలానాలు విధించింది. ఇప్పటి వరకు 500 నుంచి 600 మంది పోలీస్ సిబ్బందికి జరిమానా విధించారు. వీటికి సంబంధించిన ఆధారాలతో ట్రాఫిక్ పోలీస్ సైట్స్ లో అప్ లోడ్ చేశారు.

కేవలం పబ్లిక్ కు మాత్రమే కాదు.. పోలీసులకు రూల్స్ వర్తిస్తాయి.. మీరిచ్చిన సాక్ష్యాధారాలతో వీరికి కూడా చలానాలు పంపించాం.. ఎవరికీ ఉపేక్షించం అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్.