ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హరీష్‌రావు తనిఖీలు

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హరీష్‌రావు తనిఖీలు

సిద్ధిపేట: ఈ రోజు మంత్రి హరీష్‌రావు సిద్దిపేట జిల్లా లోని నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆస్పత్రి హాజరు రిజిస్టర్‌ను మంత్రి పరిశీలించారు. సరియైన సమయానికి విధులకు రాని డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి ఛార్జ్ మెమోలు జారీ చేసి సంజాయిషీ తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ను మంత్రి ఆదేశించారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు హరీష్‌రావు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండరాదని మంత్రి సూచించారు.