ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

ఖమ్మం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు ఆందోళన కల్గిస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం బాలింతలు, శిశువుల మృతికి కారణం అవుతుంది. వైద్యులు ఉండరు వైద్యులు ఉన్న చోట వసతులు ఉండవు. ఇలా సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రభుత్వ ఆస్పత్రులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు శిశువులు మృతి చెందారు.  సకాలంలో ఆపరేషన్ చేయకపోవటం ఫలితంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి ఒకరు ఉదయం ఇద్దరూ చనిపోయారు.     

ఆసుపత్రి సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుంది. షిప్టులు మారడం కొత్తవాళ్ళు డ్యూటీలో చేరే సమయంలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పరిస్థితుల మీద దృష్టి పెట్టని కారణంగా కింది స్థాయి సిబ్బంది విధులు సరిగ్గా నిర్వహించడం లేదని తెలుస్తోంది. పల్లెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య సతీమణి నాగమణికి పురిటినొప్పులతో ఖమ్మం నగర ప్రధాన వైద్యశాలకు తీసుకువచ్చారు. గర్భినికి ఇంకా నెలల లేదని వైద్యులు చెప్పారు. పురిటి నొప్పులు ఎక్కువ కవడంతో అక్కడే ఉన్న బల్లపై బాబుకి జన్మ నిచ్చింది. బాబు బల్లపై నుండి కింద పడడంతో మృతి చెందాడు. దీంతో బాలింతతో పాటు బంధువులు రోధిస్తున్నారు. సర్కారు ఆస్పత్రికి వస్తే ఇంతేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

రాత్రి ఓ పాప చనిపోయింది ఉదయాన్నే మరో ఇద్దరు శిశువులు మృతి చెందడం ఖమ్మం ఆస్పత్రిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఓ నిండు గర్భిణీకి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఉమ్మనీరు తాగి పాప చనిపోయింది. వైద్యం అందని కారణంగానే మరో పాప చనిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అంటే ఇంతేనా అంతంత మాత్రంగా సౌకర్యాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. ఫలితంగా బాలింతలకు కష్టాలు శిశువులు మృతి. వరుస ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. మొన్న కరీంనగర్,నేడు  ఖమ్మం జిల్లాలో  ఏదైన సరే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి ఏదో కష్టం వస్తే హాస్పిటల్ కు వెళ్తే ఇలా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. వైద్యుల తీరు, ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.