>

ప్రజారోగ్యంపై సర్కార్ దృష్టి

ప్రజారోగ్యంపై సర్కార్ దృష్టి

 హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజారోగ్యానికి సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పడకేసిన వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. సర్కారు దవాఖానలను కార్పొరేట్ తరహాలో మార్చి నిరుపేదలకు ఉన్నతస్థాయిలో వైద్యసేవలను అందిస్తున్నది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా హెల్త్ స్కీమ్‌ను అమలుచేస్తున్నది. వెల్‌నెస్ కేంద్రాల్లో ఓపీ సేవలను సూపర్ స్పెషాలిటీ సదుపాయాలతో నిర్వహిస్తున్నారు. 

గతంలో ప్రీమియం చెల్లించినా అంతంత మాత్రంగానే ఆరోగ్య సేవలు ఉండేవి. కానీ రాష్ట్ర సర్కారు.. ప్రీమియం లేకుండానే ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా వెల్‌నెస్ కేంద్రాల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఆయా వ్యాధులకు ఉపశమనం కోసం మందులను సైతం ఉచితంగా అందజేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, వనస్థలిపురంలో వెల్‌నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 12 చోట్ల ఈ సెంటర్లను విస్తరింపజేసేందుకు చర్యలు చేపట్టారు. 


Loading...