రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ఎస్ వాళ్లే ఉంటారు

రైతు సమన్వయ సమితుల్లో టీఆర్ఎస్ వాళ్లే ఉంటారు

హైదరాబాద్: అసెంబ్లీలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ...రైతు సమన్వయ సమితుల్లో కచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారని తేల్చి చెప్పారు కేసీఆర్. మేం చేసేది తప్పైతే ప్రజలే తీర్పు చెబుతారు.  కాంగ్రెస్ వాళ్లను వేస్తే సమితి లక్ష్యాలను ముందుకు సాగనిస్తారా...అని కెసిఆర్ ప్రశ్నించారు. నమ్మకం ఉన్న వాళ్లనే సమితుల్లోనే సభ్యులుగా చేర్చుకుంటాం.

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వం 56 లక్షలు. కార్యకర్త అయితే అనర్హుడు అయిపోతాడా.? కేసీఆర్ బొమ్మ కోసం అంటూ విచిత్రమైన స్టేట్ మెంట్లు చేస్తున్నారు. పాస్ బుక్ పై ఫోటో పెట్టుకుంటేనే పబ్లిసిటీ వచ్చే స్థాయిలో కేసీఆర్ ఉన్నాడా? మార్కెట్ కమిటీలో అందరికీ అవకాశం కల్పించిందే తామన్నారు కేసీఆర్. త్వరలో అన్నీ చోట్లా పెడతారు. రైతులు కాని వారికి సమితుల్లో చోటు కల్పించం” అన్నారు.