రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ

రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ

వరంగల్: రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. వరంగల్ జిల్లాలో  స్వైన్ ఫ్లూ బారిన పడిన సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.ఏసీపీ అధికారి కూడా స్వైన్ ప్లూతో చనిపోయాడు. నగరంలోని MGM  ఆస్పత్రికి వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి వచ్చే రోగులు క్యూకడుతున్నారు. వరంగల్ అర్భన్ లో 9 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకు స్లైన్ ఫ్లూతో 40 మంది వరకు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

 రాష్ట్రంలో మొత్తం 18 వందల మందికి శాంపిల్స్ టెస్ట్ చేస్తే 270 మందికి పాజిటివ్ గా వచ్చినట్లు స్పష్టం చేశారు. రానున్న చలికాలంలో స్వైన్ ఫ్లూ మరింత పెరిగే అవకాశముందంటున్నారు వైద్యాధికారులు. హైదరాబాద్ లోని గాంధీలో స్వైన్ ప్లూ రోగుల కోసం స్పెషల్ వార్డు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్  అందిస్తున్నారు.మరోవైపు డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతుండడంతో అధికారులు అలర్టయ్యారు.