తెలంగాణ రాష్ట్రం లో రోడ్లకు మహర్దశ

తెలంగాణ రాష్ట్రం లో రోడ్లకు మహర్దశ

మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్లకు మహర్దశ వచిందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గంలోని ఎక్వాయపల్లి, పెద్ద ఆదిరాల, చిన్న ఆదిరాల, గోప్లాపూర్ గ్రామాల్లో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయన తెలిపారు.

సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా.. రాష్ట్రవ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లను ప్రభుత్వం వేస్తున్నదని చెప్పారు. గతంలో ఒక్క రోడ్డుకు నిధులు కావాలన్నా ఎమ్మెల్యే పదవీకాలం ఐదేండ్లు సరిపోక పోయేదన్నారు. ఇప్పుడు మాత్రం అవసరం ఉన్న అన్నీ గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

గ్రామాల అభివృద్ధికి రోడ్లు అత్యవసరమన్నారు.అభివృద్ధికి పాటుపడే వాళ్లకే ప్రజలు పట్టం కట్టాలన్నరు మంత్రి లక్ష్మారెడ్డి, సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.