తెలంగాణ గాంధీ కేసీఆర్

తెలంగాణ గాంధీ కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టి , తెలుగు భాషా పరి రక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించినా విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను క‌చ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను క‌చ్చితంగా తెలుగులోనే రాయాలని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కేసీఆర్ నిర్ణ‌యం ప‌ట్ల మంచు మ‌నోజ్ సంతోషం వ్య‌క్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ని తెలంగాణ గాంధీగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. “మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు” అంటూ ట్వీట్ చేశాడు.