తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం

 హైదరాబాద్‌ : గత రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడగా, మంచిర్యాల లక్సెట్టిపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురియడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరీంనగర్‌ జిల్లా చౌరస్తా వద్ద ఆటోలు, రెండు భైకులు, ధ్వంసం కాగా చెట్లు  విరిగిపడ్డాయి.  జిల్లాలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.