తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

 హైద‌రాబాద్‌: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండటంతో... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అరేబియా మహా సముద్రంతో పాటు బంగాళాఖాతంలో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. రాబోయే 3, 4 రోజుల వరకు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని... ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షం పడే

అవకాశముందని... కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. నైరుతి రుతు పవనాలు చురుకుగా కదలడానికి అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని... అల్పపీడన ప్రభావం తెలుగురాష్ట్రాలపై లేదన్నారు.