త్వరలోనే ఇంటింటికి మంచినీరు

త్వరలోనే ఇంటింటికి మంచినీరు

నిజామాబాద్: టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్గుల్ గ్రామంలో నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పంప్ హౌజ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...మిషన్ భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఆర్గుల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు త్వరలోనే ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు.సీఎం కేసీఆర్ ఆశయం మేరకు అనుకున్న సమయంలోపే ఈ పనులు పూర్తవుతాయన్నారు.

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు.