వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విద్యార్థి నేతలకు సీట్లు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విద్యార్థి నేతలకు సీట్లు

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కెసిఆర్ రెండున్నర గంటల పాటు మూడేళ్ల పాలన, భవిష్యత్ ప్రణాళికపై విద్యార్థి నేతలకు అవగాహన కల్పించారు.  టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీబాస్ కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సునాయసంగా 70నుంచి 80సీట్లు గెలుస్తుందని ఇంకా కష్టపడితే మిగతా స్థానాల్లో కూడా పాగా వేయొచ్చని టీఆర్ఎస్వీ కార్యకర్తకలు చెప్పారు కేసీఆర్.

నియోజకవర్గాలు సంఖ్య పెరిగే ఛాన్సుందని అదే జరిగితే టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలకు మూడు నుంచి ఐదు టికెట్లు ఇస్తామన్నారు సీఎం.వచ్చేవారం హైదరాబాద్ లో మూడ్రోజుల పాటు టీఆర్ఎస్వీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు సిఎం కేసీఆర్. జిల్లాలు, నియోజకవర్గాల్లో విద్యార్థి సదస్సులు నిర్వహించాలని టీఆర్ఎస్ విద్యార్థి నేతలకు సూచించారు.

రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సదస్సు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. టీఆర్ఎస్వీలో 12లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని వీలైతే ఇంకా పెంచేందుకు ప్రయత్నించాలన్నారు.కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించి వాటితో ఎంతమందికి లబ్ది జరుగుతుందో ప్రజలకు టీఆర్ఎస్వీ నేతలు చెప్పారు కేసీఆర్.

 ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో నిమగ్నం కావాలని చెప్పారు. కార్యవర్గ భేటీలో టీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిఎం కేసీఆర్ వాళ్లకు దిశానిర్దేశం చేశారు.