ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులో విచారణ

ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులో విచారణ

  హైదారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై వేసిన పిటిషన్లపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం విచారణ చేసింది. ఈ అంశంపై విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. ఈనెల 12న ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు ఇసికి అనుమతిచ్చింది. బూత్ స్థాయి నుంచి ఓటర్ల జాబితాపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, వాటిని సరి చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మాజీ మంత్రి డికె అరుణతో పాటు శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. వీరి పిటిషన్లపై విచారణ పూర్తయింది. హైకోర్టు తన తీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.