ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ సిద్ధం

ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ సిద్ధం

హైదరాబాద్ :ఇండియన్ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) దుబాయ్ అందాలు ఆస్వాదించాలనుకునేవారి కోసం టూర్ ప్యాకేజీనీ సిద్ధం చేసింది. నవంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు మూడు రాత్రులు, నాలుగు పగళ్లు పర్యటన ఉంటుందని ఐఆర్‌సీటీసీ జాయింట్ జీఎం సంజీవయ్య తెలిపారు.

దుబాయ్ లోని సిటీటూర్, కింగ్స్‌ప్యాలెస్, డౌక్రూస్, ఎడారిలో సఫారీ, గ్లోబల్ విలేజ్, బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్, బుర్జ్‌ఖలీఫా దుబాయ్ మాల్‌తోపాటు అబుదాబిలోని అబుదాబి గ్రాండ్ మాస్క్, హెరిటెజ్ విలేజ్, మధ్యదారిలోని ఇతర ప్రదేశాలను చూసే అవకాశం కల్పిస్తామని, నవంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రాయం నుంచి బయలుదేరుతామని, దుబాయ్, అబుదాబీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుందని చెప్పారు.
వసతులు, ప్రయాణ వివరాలకు 040-23800580, 27702407, 23400606, 9701260605/647/671/698/701 నంబర్లతోపాటు www.irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చన్నారు.