గ్రూప్ రిజర్వేషన్‌లో పేర్లు మార్చుకునే వెసులుబాటు:  రైల్వే శాఖ

గ్రూప్ రిజర్వేషన్‌లో పేర్లు మార్చుకునే వెసులుబాటు:  రైల్వే శాఖ

 రైలులో దూర ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ తప్పని సరి. మనం చేసిన రిజర్వేషన్‌లో 10శాతం మంది పేర్లు మార్చుకునే వెసులుబాటు ఇచ్చింది. కాని ఇది రైలు బయలుదేరే 48 గంటల ముందు రిజర్వేషన్ కౌంటర్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పు ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. 

 కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, విద్యార్థుల విహార యాత్రలకు, ఎస్‌సీసీ కెడెట్ల ప్రయాణానికి గ్రూప్ రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటాం. మనం రిజర్వేషన్ చేసిన పేర్లు ఉన్న వ్యక్తులు మాత్రమే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనం రిజర్వేషన్ చేయించిన వారిలో కొందరు అనివర్య కారణాల వల్ల మనతో పాటు ప్రయాణించలేక పోతారు. దీంతో పైసలు వేస్ట్ అయ్యాయని బాధపడే వారికి పేర్లు మార్చుకునేందుకు  రైల్వే శాఖ ఉపసమనం కల్పించింది.