ప్రేమికులకు విస్తారా లవ్లీ ఆఫర్‌

ప్రేమికులకు విస్తారా లవ్లీ ఆఫర్‌

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌ లైన్స్‌   స్పెషల్‌ ఫైవ్‌ డే సేల్‌ ద్వారా  ప్రేమికులకు బంపర్‌ ఆపర్‌  ప్రకటించింది.   వాలెంటైన్స్‌ డే సందర్భంగా అయిదురోజుల ప్రత్యేక వాలెంటైన్స్ డే అమ్మకాలకు తెరతీసింది.  ఈ తగ్గింపు ధరలను సోమవారం​   ప్రకటించింది.  రూ. 899  ప్రారంభమయ్యే విమాన్‌ టికెట్‌ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎకానమీ క్లాస్  లో ఒక మార్గం ప్రయాణానికి గాను అన్నీ కలిపి  ఈ తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది.


టిక్కెట్ల అమ్మకాలు  సోమవారం ఫిబ్రవరి 13, 2017 ప్రారంభం.  శుక్రవారం ఫిబ్రవరి 17  అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్‌ లో బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా  ఫిబ్రవరి 28, 2017 సెప్టెంబర్ 20, 2017 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది.

అలాగే బిజినెస్ క్లాస్ లో  60శాతం  డిస్కౌంట్‌ తో స్పెషల్‌  డిస్కౌంట్,  ప్రీమియం ఎకానమీలో  40శాతం వరకు  రాయితీని వినియోగదారులకు  అందిస్తోంది. భారతదేశంలో విస్తారా 20ప్రదేశాలకు  ప్రయాణించేందుకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ఎయిర్‌ లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.   ఇటీవల లాంచ్‌  చేసిన  పోర్ట్ బ్లెయిర్ (అండమాన్), అమృత్‌సర్,  లేహ్ (లడఖ్) సహా, కొత్తగా ప్రారంభించిన  కోలకతా-పుణే మార్గంలో  కూడా  ఈ ఆఫర్‌ను వర్తింపచేయను‍న్నట్టు   విస్తారా తెలిపింది.