విమానంపై గద్దల దాడి

విమానంపై గద్దల దాడి

అమెరికా: ఈ నెల 14న అమెరికాలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడా నుంచి బయలుదేరిన ఓ విమానం సరిగ్గా ఆకాశంలోకి రాగానే గద్దలు చుక్కలు చూపించాయి.ఆకాశంలో యమ స్పీడుమీదున్న ఈ విమానానికి ఒకటికాదు రెండు కాదు ఒకేసారి పదుల సంఖ్యలో గద్దల గుంపు విమానం పై దాడి చేశాయి. దీంతో పైలెట్ కు ఏం చేయాలో అర్ధం కాకా కొద్దిసేపు విమానాన్ని అటు ఇటు తిప్పాడు. అయినా సరే అవి ఆ ఫ్లైట్ ను వదలలేదు.

విమానాన్ని చుట్టుముట్టి సరదాగా రెక్కలు విప్పుతూ ఎగరసాగాయి. ఈ అద్భుత దృశ్యాలను ఆ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నవారు ఫోటోలు తీశారు. దీంతో పైలెట్ చాలాసేపు వాటికి అందనంత దూరంగా స్పీడుగా డ్రైవ్ చేశాడట.అయినా ఆ పక్షులు విమానాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయట. ఈ ప్రయాణంలో కొన్ని గద్దలు ఫ్లైట్ చక్రాలకు తగలడంతో మరణించాయి. భయంతో కొన్ని గద్దలు ఫ్లైట్ కు ముందుండే అద్దాలచుట్టు వచ్చి చేరాయట. దీంతో దారి తెలియక తికమకపడ్డ పైలెట్, చివరకు ల్యాండ్ కావాల్సి వచ్చిందట.

ఈ సంఘటన చూడటానికి ఫస్ట్ థ్రిల్ గానే ఉన్నా...తర్వాత భయం వేసిందని, వెంటనే పైలెట్ ను రిక్వెట్ చేయడంతో ఇక చేసేదేమీలేక ల్యాండ్ చేశాడని చెప్పుకొచ్చారు ప్రయాణికులు. చివరకు ఫ్లోరిడాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన విమానం చక్రాలకు గుచ్చుకోవడంతో కొన్ని గద్దలు మరణించాయి.

ఆ చక్రాల్లో చిక్కుకున్న గద్దల ఫోటోలు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుండగా గుంపులుగా విమానంపై దాడి చేసిన గద్దల ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై స్పందించిన ఎయిర్ లైన్స్ అధికారులు ..వాతావరణం అనుకూలించకపోవడంలాంటి సంఘటనలతో ల్యాండ్ అయిన విమానాలను చూశాం. కానీ ఇలా పక్షులు దాడి చేయడంతో ఇంతపెద్ద విమానం ల్యాండ్ కావడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం అని వెల్లడించారు.