రాంగ్ రూట్ లో రైతుల రైలు

రాంగ్ రూట్ లో రైతుల రైలు

ఢిల్లీ: ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యలు, పంట నష్టపరిహారం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలనే డిమాండ్లతో మొన్న ఢిల్లీలో రైతులు ఆందోళన చేసారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రాంతం నుంచి 2వేల 500 మంది రైతులు ఒక్క ప్రత్యేక రైలులో బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేశారు.

ఆ తర్వాత 20వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని సఫ్తార్ ఘంజ్ రైల్వేస్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యింది. ఈ రైలు 21వ తేదీ సాయంత్రానికి మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకోవాలి. ఓ రోజు జర్నీ, ఢిల్లీలో ఆందోళనతో రైలు ఎక్కగానే రైతులు నిద్రలోకి జారుకున్నారు. అయితే ఈ రైలు కొల్హాపూర్ చేరుకోలేదు.

ఓ స్టేషన్ దగ్గర రాంగ్ సిగ్నల్ వల్ల 160 కిలోమీటర్లు రాంగ్ రూట్ లో ప్రయాణించి మధ్యప్రదేశ్ లోని బన్మోర్ రైల్వేస్టేషన్ చేరుకుంది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఎంత దూరం వెళ్లినా ఇంకా కొల్హాపూర్ రావటం లేదని రైతులందరూ అనుకుంటున్నారే గానీ రాంగ్ రూట్ లో వెళుతున్నాం అన్న సంగతి గుర్తించలేదు.

21వ తేదీ సాయంత్రం మధ్యప్రదేశ్ బన్మోర్ రైల్వేస్టేషన్ లో ఆగిన రైలు నుంచి దిగిన రైతులు.. రైలు డ్రైవర్, గార్డ్ ను ప్రశ్నించారు. అప్పటిగానీ వాళ్లకి అసలు విషయం తెలిసింది. రాంగ్ రూట్ లో వచ్చామని. దీంతో రైతులు అందరూ ఆందోళనకి దిగారు. బన్మోర్ స్టేషన్ మాస్టర్ చొరవతో రెండు గంటల తర్వాత.. రైలుని వెనక్కి పంపారు. 22వ తేదీ ఉదయం ఈ రైలు కొల్హాపూర్ చేరుకుంది. రైలును రాంగ్ రూట్ లోకి తీసుకెళ్లటంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఎక్కడ తప్పు జరిగింది అనేది పరిశీలిస్తున్నారు.