బిడ్డ పుడితే బిల్ కట్టనక్కర్లేదట

బిడ్డ పుడితే బిల్ కట్టనక్కర్లేదట

బిడ్డ పుడితే బిల్ కట్టనక్కర్లేదట.
బిడ్డ పుడితే భారం అనుకుంటారు. ముందుగానే తెలిస్తే అబార్షన్‌ చేయించేసుకుంటారు. పుట్టాక తెలిస్తే మొహం చాటే స్తారు. అందుకే ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సమాజంలో పెరిగిపోతున్న ఈ లింగ వివక్షను అరికట్టి, సెక్స్‌ రేషియో (లింగ నిష్పత్తి)ని పెంచేందుకు గుజరాత్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ముందుకొచ్చింది. తమ ఆస్పత్రిలో చేరిన గర్భిణులు ఆడపిల్లకు జన్మనిస్తే, ఎలాంటి ఫీజూ కట్టాల్సిన పని లేదని ఆఫర్‌ ఇచ్చింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సింధు సేవ సమాజ్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సింధు హాస్పిటల్‌ ఈ పనికి పూనుకుంది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది మగవారికి, కేవలం 890 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. అందుకే ఈ నిష్పత్తిని తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. ఈ ఆస్పత్రిలో నార్మల్‌ డెలివరీకి రూ.7 వేలు, సిజేరియన్‌కు రూ.20 వేలు ఫీజుగా వసూలు చేస్తారు. అయితే ఇక నుంచి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు ఈ ఫీజులేవీ చెల్లించనవసరం లేదు. అంతేకాదు ఆడపిల్ల పుడితే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వెనక్కి ఇచ్చేస్తారట.