>

చీరలను ఇలా భద్రపరచండి!

చీరలను ఇలా భద్రపరచండి!

 వివిధ డిజైన్‌లలో చీరల కొనుగోలు ఈ రోజుల్లో కామన్‌. వాటిలో కంచిపట్టు, జరీ, ఎంబ్రాయిడరీ ఇలా ఎన్నో రకాల చీరలు ఉంటాయి. అలా ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా అంత ఖరీదైన చీరలను అంతే పదిలంగా చూసుకోవాలి. సీజన్‌తో పనిలేకుండా చీరలను జాగ్రత్తలు చూసుకునేందుకు కొన్ని జాగ్రత్తలు. 


చీరలు కొనుగోలు చేసే సమయంలోనే వాటిని ఉతికే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అడిగి తెలుసుకోవాలి. డ్రైక్లీన్‌ మాత్రమే అని రాసి ఉండే చీరల్ని డ్రైక్లీనింగ్‌ ఇవ్వడం తప్పనిసరి. కొనే ప్రతి చీరకూ కొంగులు, ఫాల్‌ కుట్టించడం మర్చిపోకూడదు. పట్టు చీరల మధ్యలో నాఫ్తాలిన్‌ ఉండలను ఉంచకూడదు. వాటి బదులు గంధం పొడిసంచులను (శాండల్‌ పౌచెస్‌) లేదా పలుచని వస్త్రంలో మూటకట్టిన ఎండు వేపాకును ఉంచడం మంచిది. చీరలను చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి. అన్నిరకాల చీరలను వార్డ్‌రోబ్‌లో అలాగే సర్దేయకుండా తరచూ వాడే చీరలను హ్యాంగర్లకు తగిలించాలి. చీరలపై మరకలు పడితే వెంటనే నీటితో కడిగేయాలి.

అదే నూనె మరకైతే టాల్కమ్‌ పౌడర్‌ తగినతంత చల్లాలి. పౌడర్‌ జిడ్డును పీల్చేస్తుంది. ఆ తరువాత డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి. ఇస్త్రీ చేస్తున్నప్పుడు అన్ని రకాల చీరల్ని సూటిగా ఇస్త్రీ పెట్టెతో రుద్దేయకూడదు. ఆయా చీరల ఫ్యాబ్రిక్‌ను బట్టి ఐరన్‌ బాక్స్‌లో హీట్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసుకోవాలి. నాజూగ్గా ఉండే సిల్క్‌, ఎంబ్రాయిడరీ చీరలకు మధ్యలో వేరే కాటన్‌ వస్త్రం ఉంచి ఇస్త్రీ చేయాలి. మూడు నెలలకొకసారి చీరలను కాసేపు గాలి వచ్చే చోట ఆరేయాలి.

ఆ తరువాత మడతపెట్టాలి. మడతల్లో చిరగకుండా ఉండాలంటే మార్చి మార్చి మడతేయడం, చుట్టడం మంచిది. ఎంబ్రాయిడరీ చీరల్ని, పట్టు చీరల్ని హ్యాంగర్లకు వేలాడదీయకూడదు. వీటిని విడివిడిగా మృదువెైన కాటన్‌, ముఖుమల్‌ వస్త్రంలో చుట్టిపెట్టడం మంచిది. హెవీ సిల్క్‌, జరీ వర్క్‌ చేసిన చీరలను విడివిడిగా భద్రపరచాలి. ఒకే వరుసలో ఉంచితే ఒక చీర దారాలు మరోచీరకు పట్టుకొని పాడెైపోతాయి.


Loading...