ముడతలు పోవాలంటే?

ముడతలు పోవాలంటే?

  చాలామందికి వయసుతో పనిలేకుండా ముఖంపై ముక్కు, కళ్ల పక్కన, నుదుటి మీద చాలా ముడుతలు వస్తుంటాయి. వీటివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ముఖంపై ముడుతలు రావడానికి అనేక కారణాలున్నాయి. కాస్మొటిక్‌ పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం ఇందుకు ప్రధాన కారణం. దీంతోపాటుగా వయసు వల్ల వచ్చే మార్పులు, కాలుష్యం, నిద్ర లోపించడం, పోషకాహారలోపాం కూడా దీనికి దోహదం చేస్తాయి.

ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల ద్వారా ముఖంపై ఏర్పడే ముడతలు, మచ్చల్ని కొంతవరకూ పరిష్కరించుకోవచ్చు. 
పాలల్లో, పసుపు వేసి బాగా కలిపి.. ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నునుపు తేలుతుంది. ఇలా వారానికొకసారి చేస్తే.. ముడతల ప్రభావం అంతగా కనిపించదు.

బాగా ముగ్గిన అరటిపండు పేస్ట్‌, కాస్తంత తేనె, శనగపిండి, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసి.. ముఖానికి పట్టించి, ఆరేవరకూ ఉంచి కడిగేస్తే.. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. 
వెన్న కూడా.. ముఖానికి మంచి ఫేస్‌ప్యాక్‌లా పనిచేస్తుంది. వారానికొకసారి వెన్నను ముఖానికి పట్టించి.. చేతివేళ్ళతో మృదువుగా రుద్ది, అరగంట తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా మారి, ముడతల సమస్య తగ్గుతుంది.