44 విమానాలను తొలగించిన పౌర విమానయాన అధికారులు

44 విమానాలను తొలగించిన పౌర విమానయాన అధికారులు

 న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌ బస్‌ ఏ320 నియో విమానం సోమవారం అర్ధరాత్రి ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్‌ మొరాయించింది. దీంతో 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని వెంటనే ఢిల్లీలో ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. దీంతో పిడబ్ల్యు 1100 ఇంజన్లను వినియోగించే 44 ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాలను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) సేవల నుంచి తప్పించినట్లు భారతీయ విమాన శాఖ వెల్లడించింది. వీటిలో 8 విమానాలు ఇండిగో సంస్థకు చెందినవి కాగా మూడు విమానాలు గో ఎయిర్‌వికు చెందినవి. ఈ 44 విమానాల్లోనూ ప్రాట్‌ అండ్‌ వైట్నీ సంస్థ తయారుచేసిన పీడబ్ల్యూ 1100 రకం ఇంజిన్లను అమర్చి వినియోగిస్తున్నారు. అయితే ఈ ఇంజన్లు తరచు మరమ్మతులు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.