అఫ్ఘాన్‌లో  ఉగ్రదాడి

అఫ్ఘాన్‌లో  ఉగ్రదాడి

  కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. పోలీస్‌ శిక్షణా కేంద్రం, సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు మెరుపుదాడులకు పాల్పడ్డారు. ఈదాడిలో సైనికులు, పోలీసులు సహా 126 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అఫ్ఘాన్‌ రక్షణశాఖ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...వార్దాక్‌ ప్రావిన్స్‌ రాజధాని మైదాన్‌ షహర్‌లోని సైనిక శిబిరం, దాని పక్కనే ఉన్న పోలీస్‌ శిక్షణా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు సోమవారం మెరుపుదాడులకు పాల్పడ్డారు. డినోనేటర్ల సాయంతో కారుబాంబు పేల్చినట్టు అనుమానిస్తున్నామని తెలిపింది. తాలిబన్ల దాడిలో 126 మంది మృతి చెందారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. తాలిబన్లు దాడికి పాల్పడ్డ మైదాన్‌ షహర్‌ ప్రాంతం కాబూల్‌ నగరం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, లోగార్‌ ప్రావిన్స్‌లో తాలిబన్లు ఆదివారం పంజా విసిరారు. ఈ దాడిలో 8 మంది సైనికులు మృతిచెందారు.