అమెరికాలో  విస్తరిస్తున్న టీచర్ల సమ్మె

అమెరికాలో  విస్తరిస్తున్న టీచర్ల సమ్మె

  ఒక్లహామా : మరింత మెరుగైన వేతనాలు కోసం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలపరచాలని కోరుతూ పశ్చిమ వర్జీనియా టీచర్లు, స్కూలు సిబ్బంది 9రోజుల పాటు సమ్మె చేసిన నేపథ్యంలో ఆ పోరాటం ఒక్లహామా, కెంటకీ, అరిజోనా, ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ప్రభుత్వ విద్యా రంగానికి పెద్ద మొత్తంలో నిధుల్లో కోత విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా విద్యా శాఖ మంత్రి బెట్సే డివోస్‌ ఆదివారం రాత్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వందల కోట్ల డాలర్లను ప్రభుత్వం విద్యపై ఖర్చు పెడుతున్నా పెద్దగా ఫలితాలు రావడం లేదని అన్నారు. ఈ తరుణంలో నిధుల్లో కొంతమేరకు కోత విధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై నిధులు ఖర్చు పెట్టాలి కానీ స్కూలు భవనాలు, సంస్థలపై కాదని వ్యాఖ్యానించారు. దాదాపు దశాబ్ద కాలం నుండి అంటే 2008 ఆర్థిక మాంద్యం తలెత్తినప్పటి నుండి పలు రాష్ట్రాలు స్కూలు నిధుల్లో కోత విధిస్తూ వచ్చాయి.